‘రౌడీ జనార్థన’లో విజయ్ దేవరకొండ మాస్ ట్రీట్ అదిరిపోద్ది – దిల్ రాజు

‘రౌడీ జనార్థన’లో విజయ్ దేవరకొండ మాస్ ట్రీట్ అదిరిపోద్ది – దిల్ రాజు

Published on Dec 23, 2025 1:00 AM IST

dilraju t

హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘రౌడీ జనార్థన’. దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో అభిమానుల మధ్య ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు రవి కిరణ్ మాట్లాడుతూ.. ‘విజయ్ కథ వినగానే పాత్రను వెంటనే ఓన్ చేసుకున్నారు. ఈస్ట్ గోదావరి యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టైటిల్ గ్లింప్స్ కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా బలమైన కంటెంట్ మున్ముందు రాబోతుంది.’ అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..‘ఇప్పటివరకు యూత్‌ఫుల్ పాత్రలతో మెప్పించిన విజయ్ ఈ సినిమాలో తొలిసారి పూర్తిగా మాస్, రగ్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఆయన మాస్ అవతారంలో ఇచ్చే ట్రీట్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. 80వ దశకం నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్, డీవోపీ ఆనంద్ సి చంద్రన్ పాల్గొని మాట్లాడారు. ఇక ఈ ప్రెస్టీజియస్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజా వార్తలు