దిల్ రాజు మరొక క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారా ?

Published on Jun 16, 2021 1:04 am IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆలోచనంతా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీద, సరికొత్త కాంబినేషన్ల మీదనే ఉంది. అస్సలు ఊహించని కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు ఆయన. ఇప్పటికే తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమానియు సెట్ చేశారు. అలాగే అస్సలు ఊహించని రీతిలో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమాను లాక్ చేశారు. ఈ రెండు కాంబినేషన్స్ చూశాక దిల్ రాజు ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నారనేది అర్థమవుతోంది.

ఇదే కాదు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఈ మూడు కూడ పాన్ ఇండియా సినిమాలే. ఇవి కాకుండా ఇంకో కొత్త కాంబినేషన్ కోసం ట్రై చేస్తున్నారట దిల్ రాజు. అదే బోయపాటి శ్రీను, సూర్య కాంబినేషన్. తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. కానీ కుదరలేదు. దిల్ రాజు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూర్యతో ఒక ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కాస్త వెయిట్ చేయక తప్పదు.

సంబంధిత సమాచారం :