దిల్ రాజు చేతికి అనుష్క ‘రుద్రమదేవి’ రైట్స్

దిల్ రాజు చేతికి అనుష్క ‘రుద్రమదేవి’ రైట్స్

Published on Jul 28, 2015 8:26 PM IST

rudhramadevi-(1)
ఫస్ట్ ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. దాదాపు 9 ఏళ్ళ పాటు రీసర్చ్ చేసి గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. అనుష్క రుద్రమదేవి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాని సెప్టెంబర్ 4న రిలీజ్ చేయనున్నట్ల ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉండడంతో ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైంది.

మాకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు రెండు ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఓ భారీ మొత్తానికి దిల్ రాజు నైజాంతో పాటు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. నైజాంలో స్ట్రాంగ్ బేస్ ఉన్న దిల్ రాజు ఈ సినిమాని తీసుకోవడంతో నిర్మాతలు హ్యాపీగా ఫీలవుతున్నారు. మిగిలిన ఏరియాలలో కూడా ఈ మూవీ బిజినెస్ జోరుగా సాగుతోంది. అనుష్కతో పాటు రానా, అల్లు అర్జున్, కృష్ణంరాజు, నిత్యా మీనన్, కేథరిన్, హంసా నందిని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

3డి గ్లాసెస్ లేకుండా 3డి ఫార్మాట్ లో ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించేలా గుణశేఖర్ వర్క్ చేస్తున్నాడు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాని గుణశేఖర్ తన సొంత బ్యానర్ లో నిర్మించాడు.

తాజా వార్తలు