శర్వానంద్ సినిమా ఆడియో ఫంక్షన్ కి సరికొత్త ప్లాన్ వేస్తున్న దిల్ రాజు !
Published on Nov 5, 2016 5:31 pm IST

DIL-RAJU
‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి కమర్షియల్ హిట్ తరువాత యంగ్ హీరో శర్వానంద్ చేస్తున్న చిత్రం ‘శతమానంభవతి’. పలు హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన వేగేశ్న సతీష్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో తాత – మనవళ్ల మధ్య ఉండే అనుబంధం ప్రధానాంశంగా ఉండనుంది. అలాగే ఈ చిత్రం ఎంతో ముఖ్యమైనదని నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టుపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.

ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న 25వ సినిమా కావడంతో దిల్ రాజు కు ఈ సినిమా సెంటిమెంట్ గా మారింది. ఇది కూడా ‘బొమ్మరిల్లు’ రేంజులో హిట్టవుతుందని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఈ సినిమా ఆడియోని కాస్త వెరైటీగా చేయాలనుకుంటున్నాడట దిల్ రాజు. అందుకే ఇప్పటి వరకూ తాను తీసిన 25 సినిమాల హీరోలను పిలిచి డిసెంబర్ 18న వారి సమక్షంలో ఈ ఆడియో జరపాలనుకుంటున్నాడట. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి బరిలోకి దిగనుంది.

 
Like us on Facebook