దిల్ రాజు అంచనా నిజమైంది !

Published on Oct 4, 2018 1:45 pm IST

తెలుగులో ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ నిర్మాతల పేర్లు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు దిల్ రాజు. దిల్ సినిమా తో తన ప్రస్థానం ప్రారంభించిన ఆయన తరువాత వరుస విజయాలతో బడా నిర్మాతగా మారిపోయారు. అయితే గత కొద్దీ కాలంగా దిల్ రాజు సెలక్షన్లో కొంచెం తడబాటు కనిపించింది. అందుకే ‘లవర్ , శ్రీనివాస కళ్యాణం’ లాంటి వరుస పరాజయాలను చవి చూశారు . తాజాగా మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు ఆయన. ఇక దిల్ రాజు సినిమాల విషయంలో ఆయనకు వున్నా క్లారిటీ ని మారోసారి నిరూపించుకున్నారు.

ఇటీవల ’96’ అనే డబ్బింగ్ మూవీ ఫై మనుసుపారేసుకున్న ఆయన ఈసినిమా యొక్క తెలుగు రైట్స్ ను కొన్నారు. విజయ్ సేతుపతి ,త్రిష జంటగా తమిళ భాషలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకులనుండి విశేష స్పందన లబిస్తుంది. చాలా అరుదుగా4 రేటింగ్ వచ్చే సినిమాల జాబితాలోకి ఈచిత్రం చేరిపోయింది. 1996 లో జరిగే ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కింది ఈచిత్రం విమర్శకుల నుండి ప్రశంశలు పొందుతుంది. ఇక దిల్ రాజు ఎలాగూ తెలుగులో ఈచిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఖాతాలో మరో విజయం చేరిపోయినట్లే.

సంబంధిత సమాచారం :