బన్నీ వద్దన్నాడు…మరి చరణ్?

Published on Aug 7, 2020 11:10 am IST

నాపేరు సూర్య తరువాత అల్లు అర్జున్ అంగీకరించిన ప్రాజెక్ట్స్ లో ఐకాన్ ఒకటి. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కాల్సి వుంది. ఐతే నాపేరు సూర్య ఫలితం తరువాత సందిగ్ధంలో పడ్డ బన్నీ ప్రయోగాలకు బయపడి సుకుమార్, వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్స్ పక్కన పెట్టారు. సేఫ్ సైడ్ గా త్రివిక్రమ్ తో అల వైకుంఠపురంలో అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప చేస్తున్న బన్నీ తన 21వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ప్రకటించారు. దీనితో ఐకాన్ మూవీ ఇక ఆగిపోయినట్లే అని వార్తలు వస్తున్నాయి.

ఐతే ఈ ప్రాజెక్ట్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు మాత్రం స్క్రిప్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. అందుకే రామ్ చరణ్ తో ఐకాన్ మూవీ చేయాలని అనుకుంటున్నారట. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ తో ఈ మూవీ చేయాలనేది దిల్ రాజు ఆలోచనగా తెలుస్తుంది. చరణ్ సైతం తన కొత్త మూవీ ప్రకటించ లేదు. చరణ్ కనుక ఈ స్క్రిప్ట్ ఓకే చేస్తే మూవీ పట్టాలెక్కడం ఖాయం. ఇక చరణ్ నో చెప్పిన పక్షంలో హీరో నానితో చేయాలనేది దిల్ రాజు ప్లాన్ అని టాలీవుడ్ లో వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More