పవన్ – అనిల్ రావిపూడి కాంబో సెట్టవుతుందా ?

Published on Jun 8, 2021 7:05 pm IST

ప్రస్తుతం ఉన్న యువ దర్శకుల్లో ఎంత పెద్ద హీరోతో అయినా బోలెడంత హాస్యం పండించగల దర్శకుడు అనిల్ రావిపూడి. రవితేజ, వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేశాడు అనిల్ రావిపూడి. ‘సరిలేరు నీకెవ్వరు’తో సాలిడ్ హిట్ అందుకున్న రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్ 3’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వీలు దొరికితే తర్వాతి సినిమాను మహేష్ బాబుతో చేయాలనేది ఆయన టార్గెట్. అయితే ఇప్పుడప్పుడే మహేష్ బాబు ఖాళీ అయ్యేలా లేరు.

ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చేస్తున్న ఆయన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వర్క్ చేస్తారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి 2022 ద్వితీయార్థం అవుతుంది. ఈలోపు అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ ఫినిష్ చేసి ఫ్రీ అవుతారు. మహేష్ బాబు ఖాళీ అయ్యేలోపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా చేయించాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారని, ఈమేరకు చర్చలు కూడ జరుగుతున్నాయని ఇండస్ట్రీ టాక్.

దిల్ రాజుకు పవన్ కళ్యాణ్ డేట్స్ పట్టుకోవడం అంత కష్టమేమీ కాదు. పవన్ చేస్తున్న రెండు సినిమాలు, త్వరలో మొదలుపెట్టనున్న హరీష్ శంకర్ సినిమా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయి. ఆ తరవాత అనిల్ రావిపూడి సినిమాను సెట్ చేయాలనేది దిల్ రాజు ఉద్దేశ్యమట. మరి అందరూ అంటున్నట్టు ఈ కాంబినేషన్ కుదురుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :