ఒక్క హిట్ దెబ్బకి.. స్పీడు బాగా పెరిగింది !

Published on Feb 26, 2019 9:14 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా, సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న దిల్ రాజుకు గత ఏడాది నిర్మాతగా లవర్, శ్రీనివాస కళ్యాణం చిత్రాల రూపంలో రెండు ప్లాప్ లు వచ్చాయి. ఇక డిష్టిబ్యూటర్ గా అంతకన్నా ఎక్కువే ప్లాప్ లనే ఎదురుకున్నాడు. పైగా ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేక చతికల పడ్డాయి.

అయితే ఇలాంటి పరిస్థుతుల్లో సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 రూపంలో దిల్ రాజు మళ్ళీ భారీ విజయాన్ని అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా స్పీడ్ పెంచేశాడు. ఇక వరుసగా సినిమాలు చేయటానికి సన్నధం అవుతున్నాడు ఈ బడా నిర్మాత. ఈ కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది మాత్రం ఎఫ్2 కలెక్ట్ చేసిన కలెక్షన్సే. నిజంగానే ‘ఎఫ్ 2’ ఆయన ఊహించిన దానికంటే ఎక్కువుగానే కలెక్షన్స్ ను సాధించింది.

కాగా దిల్ రాజు ప్రస్తుతం మహేష్ బాబు తో మహర్షి సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం చివరి దశలో వుంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలకానుంది. అలాగే శర్వానంద్ – సమంతతో ఒక సినిమా, రవితేజతో మరో సినిమా చేస్తున్నాడు. మహేష్ తో తర్వలోనే మరో చిత్రాన్ని కూడా నిర్మించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా ఇద్దరు యంగ్ హీరోలతో కూడా వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పట్లో రాజ్ తరుణ్ తో ఓ సినిమా అనుకున్నారు. ఇప్పట్లో కాకపోయినా ఎన్టీఆర్ తో, బన్నీ తో కూడా సినిమాలు చేస్తానని ఒప్పందాలు ఉన్నాయి. ఈ లిస్టు చూస్తుంటే ‘దిల్ రాజు’ మొత్తానికి బాగా స్పీడు పెంచాడనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :