వెంకీ – వరుణ్ F2 మొదలయ్యేది అప్పుడే!

15th, April 2018 - 11:44:06 AM

ప్రస్తుతం టాలీవుడ్ మల్టీస్టారర్ కథలతో కళకళలాడుతోంది. ఒకే తెరపై ఇద్దరు స్టార్ హీరోలు నటించడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మల్టి స్టారర్ కథలకు విక్టరీ వెంకటేష్ ముందుంటాడని అందరికి తెలిసిందే. మెగా ఫ్యామిలిలో పవర్ స్టార్ తో నటించిన తరువాత వెంకీ ఇప్పుడు మెగా యువ హీరో వరుణ్ తేజ్ తో ఒకే తెరపై అల్లరి చేయడానికి సిద్దమయ్యాడు. వీరిద్దరూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో F2 అనే కథను ఒకే చేసిన సంగతి తెలిసిందే.

పూర్తి వినోదాత్మకంగా తెరకెక్క ఈ సినిమా షూటింగ్ ను సమ్మర్ ఎండింగ్ లో స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. జూన్ నెలలో కూల్ గా రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ దర్శకుడు అనిల్ రావిపూడి – నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా వెంకీ – వరుణ్ తో చర్చలు జరిపారు. ఇక హీరోయిన్లతో పాటు మిగతా నటీనటులను అలాగే టెక్నీషియన్స్ ను కూడా వీలైనంత త్వరగా ఫిక్స్ చేసుకునేందుకు దర్శకుడు సన్నాహకాలు చేస్తున్నాడు.