96 రీమేక్ ఫై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు !

Published on Sep 29, 2018 11:03 am IST

తమిళ భాషలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఫొటోగ్రాఫర్ గా నటిస్తున్నాడు. 1996లో జరిగే ప్రేమ కథ నేపథ్యంలో తెరెక్కుతున్న ఈచిత్రం అక్టోబర్ 4న తమిళ ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఇటీవల చెన్నై వెళ్లి స్పెషల్ స్క్రీనింగ్ లో ఈచిత్రాన్ని దిల్ రాజు వీక్షించారని ఈచిత్రం ఆయనకు బాగా నచ్చడంతో సుమారు కోటి రూపాయలకు ఈసినిమా తెలుగు రీమేక్ హక్కులను కొన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. 96చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాం. త్వరలోనే ఈచిత్రం లో నటించే నటీనటులను అలాగే సాంకేతిక నిపుణలను అధికారికంగా ప్రకటించనున్నాం అని కొద్దీ సేపటిక్రితం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక దిల్ రాజు ప్రస్తుతం రామ్ తో ‘హలోగురు ప్రేమకోసమే’ , సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘మహర్షి’ అనే చిత్రాలను నిర్మిస్తున్నారు. దాంట్లో’ హలోగురు .. ‘ అక్టోబర్ 18న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :