హిందీలో మెరవనున్న ‘గద్దలకొండ గణేష్’ భామ

Published on Jan 26, 2021 7:01 pm IST

చిన్న సినిమాతో కథానాయకిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి ‘డింపుల్ హయాతి’. ఆతర్వాత తమన్నా, ప్రభుదేవాల ‘దేవి 2’లో ఒక కీ రోల్ చేసింది. ఆ సినిమా తర్వాత వరుణ్ తేజ్, హరీష్ శంకర్ హిట్ మూవీ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘సూపర్ హిట్టు’ అనే స్పెషల్ సాంగ్ చేసి అందాలతో ఆకట్టుకున్న ఈమెకు ఆఫర్లు పెరిగాయి. తెలుగులో పెద్ద సినిమాలు అందుతున్నాయి. ‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ తర్వాతి చిత్రం ‘ఖిలాడి’లో డింపుల్ హయాతీ ఒక కథానాయకిగా నటిస్తోంది.

ఇది కాకుండా బాలీవుడ్లో ‘అత్రంగి రే’ చిత్రంలో కూడ నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో పాటు తమిళ హీరో ధనుష్ కూడ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. సారా అలీఖాన్ హీరోయిన్. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఆఫర్ డింపుల్ హయాతీకి బాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టడానికి బాగా ఉపకరిస్తుంది. సినిమా మంచి విజయాన్ని సాధిస్తే ఆమెకు లీడ్ హీరోయిన్ పాత్రలు దక్కే అవకాశం కూడ ఉంది.

సంబంధిత సమాచారం :