“వైల్డ్ డాగ్”లో నాగ్ సూపర్బ్ గా కనిపిస్తారు – దర్శకుడు అహిషోర్

Published on Mar 25, 2021 8:00 am IST

టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హంక్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “వైల్డ్ డాగ్”. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం లో నాగ్ ఎన్ ఐ ఏ ఏజెంట్ గా కనిపించనున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు అహిషోర్ సోలోమోన్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో నాగ్ రోల్ కోసం మాట్లాడుతూ నాగ్ ఈ చిత్రంలో సూపర్బ్ గా కనిపిస్తారని తనతో ఇది వరకే ఊపిరి సినిమాకు పని చేసానని సో ఆయన పనితనం కోసం తనకి తెలుసనీ తెలిపారు. అంతే కాకుండా తాను ఏజ్ తో సంబంధం లేకుండా మాంచి యాక్షన్ పార్ట్ ను కూడా తాను చేసారని అది సినిమాలో అంతే బాగా కనిపిస్తుంది అని తెలిపారు.

అలాగే సినిమా కోసం మాట్లాడుతూ ఇది ఓ ప్రయోగాత్మక సినిమా అయితే కాదని కాకపోతే యాక్షన్ పార్ట్ మాత్రం ఎక్కువ ఉంటాయి ఏవ్ బాగా థ్రిల్ చేస్తాయని దర్శకుడు తెలిపాడు. మరి థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 2న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :