మహా సముద్రం చిత్రం డైలాగ్ రైటర్ పై అజయ్ భూపతి కీలక వ్యాఖ్యలు!

Published on Oct 10, 2021 11:27 pm IST

ఆర్ ఎక్స్ 100 చిత్రం తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. చాలా గ్యాప్ తర్వాత మహా సముద్రం చిత్రం తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కి సిద్దమైంది. అయితే ఈ చిత్రం కి డైలాగ్ రైటర్ గా పని చేస్తున్న సయ్యద్ పై దర్శకుడు అజయ్ భూపతి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్ ఎక్స్ 100 మరియు మహా సముద్రం చిత్రాల డైలాగ్ రైటర్ సయ్యద్ షూటింగ్ సమయం లో కూడా నాతో ఉంటారు అని అన్నారు. అతని రైటింగ్ నైపుణ్యం తో మా సినిమా ఆత్మ ను బాగా ఏమోషన్ చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన డైలాగ్స్ ప్రతి పాత్రను బాగా ఎలివేట్ చేసింది అని అన్నారు.అతని డైలాగులు బాగా హిట్ అవుతాయి అని నేను కచ్చితంగా అనుకుంటున్నాను అంటూ అతని ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేశారు అజయ్ భూపతి. ఈ డైలాగ్ రైటర్ పై అజయ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు, ప్రేక్షకులు, అభిమానులు లైక్స్ కొడుతూ, కామెంట్స్ చేస్తున్నారు.

మహా సముద్రం చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు, విడియోలు, ట్రైలర్లు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్ర ను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :