చెప్పినట్టే మొత్తానికి మాస్ పూనకాలు ఇచ్చిన డైరెక్టర్ బాబీ.!

చెప్పినట్టే మొత్తానికి మాస్ పూనకాలు ఇచ్చిన డైరెక్టర్ బాబీ.!

Published on Oct 27, 2022 8:46 PM IST


లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో రోల్స్ చేసారు. మాస్ క్లాస్ అని ఎందులో అయినా కూడా మెగాస్టార్ తన మార్క్ తో అలరించారు. ఇక తన నుంచి అయితే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫ్యాన్స్ కోరుకుంటున్న వింటేజ్ చిరు అయితే ఇంకా కనిపించలేదు. కానీ ఆ లోటుని తీరుస్తా అంటూ మెగా ఫ్యాన్ డైరెక్టర్ కొల్లి రవీంద్ర(బాబీ) మెగా ప్రామిస్ ని చేసాడు.

తాను మొదటి నుంచి చెప్తున్న ఒకే ఒక్క మాట “మాస్ పూనకాలు” డెఫినెట్ గా ఉంటాయని చెప్పింది ఈరోజుతో అయితే అక్షరం పొల్లుపోకుండా నిజం చేసాడని చెప్పాలి. “వాల్తేరు వీరయ్య” కొన్ని దశాబ్దాలు వెనక్కి అయితే మెగా ఫ్యాన్స్ అందరినీ తాను తీసుకెళ్లిపోయాడు. మెగాస్టార్ ని వింటేజ్ స్వాగ్ తో ప్రెజెంట్ చేస్తూ చూపించిన తీరు ఫ్యాన్స్ లో మెంటల్ మాస్ గా మారింది.

కేవలం టైటిల్ టీజర్ కే ఇలా ఉంటే ఇక మిగిలిన అప్డేట్స్, సినిమాలో మాస్ మహారాజ్ రోల్ ఇలా సినిమా ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమాతో మెగాస్టార్ అసలు సిసలు బిగ్గెస్ట్ కం బ్యాక్ ఇస్తారనిపిస్తుంది. మరి లేటెస్ట్ గా అయితే 10 మిలియన్ వ్యూస్ ని ఈ వీడియో క్రాస్ చేసింది. ఇక ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు