మెగా 158 : మెగాస్టార్ ర్యాంపేజ్‌కి సిద్ధం అవ్వండి అంటున్న డైరెక్టర్ బాబీ

మెగా 158 : మెగాస్టార్ ర్యాంపేజ్‌కి సిద్ధం అవ్వండి అంటున్న డైరెక్టర్ బాబీ

Published on May 21, 2026 8:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా158’. ఈ ప్రాజెక్ట్‌ను నేడు(మే 21) పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు చూపించిన ప్రేమ, ఉత్సాహంపై దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నాడు. ఫ్యాన్స్ అందించిన ఈ భారీ రెస్పాన్స్ తనపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నాడు.

తాను ‘మెగా158’ చిత్రాన్ని ఒకే ఒక స్పష్టమైన ఉద్దేశ్యంతో తెరకెక్కిస్తున్నట్లు బాబీ ఈ నోట్‌లో స్పష్టం చేశాడు. మనం ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకునే ‘మెగాస్టార్’ ఇమేజ్‌కు మాత్రమే కాకుండా, తరాల తరబడి అందరూ ఎంతగానో అభిమానించే ఆయనలోని ఒక గొప్ప నటుడిని గౌరవించే విధంగా ఈ సినిమా ఉండబోతోందని హామీ ఇచ్చాడు. చిరంజీవిలోని వింటేజ్ నటనను, మాస్ ఎలిమెంట్స్‌ను ఈ చిత్రంలో అద్భుతంగా చూపించబోతున్నట్లు హింట్ ఇచ్చాడు.

చివరగా, ఈ సినిమా వింటేజ్ అభిమానులకే కాకుండా.. ఈ తరం ప్రేక్షకులకు కూడా ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని బాబీ ధీమా వ్యక్తం చేశాడు. థియేటర్లలో మెగాస్టార్ సృష్టించబోయే ర్యాంజేజీకి అందరూ సిద్ధంగా ఉండాలంటూ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించాడు. ఈ ఎమోషనల్ నోట్‌తో ‘మెగా158’ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా మరింత పెరిగాయని చెప్పాలి.

తాజా వార్తలు