కొత్త కాంబినేషన్ సెట్ అవుతుందా ?

Published on Apr 17, 2021 9:00 pm IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ కొత్త కాంబినేషన్ సెట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బోయపాటి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి కానుంది. మరి ఆ తరువాత సినిమా ఏమిటి ? కాగా తాజాగా తన తరువాత సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ తో బోయపాటి ప్లాన్ చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్నారని, లేదూ అల్లు అర్జున్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. కానీ బోయపాటి శ్రీను కళ్యాణ్ రామ్ కోసం ఓ స్క్రిప్టును సిద్ధం చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కు సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. మరి ఇప్పుడు కళ్యాణ్ రామ్ – బోయపాటి కాంబినేషనైనా సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :