చిరు 150వ సినిమా డైరెక్టర్ అతనేనా.?

చిరు 150వ సినిమా డైరెక్టర్ అతనేనా.?

Published on Apr 14, 2015 11:36 AM IST

chiru-puri
సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్ళినా మెగా అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఒకింత కూడా తగ్గలేదు. ఆయన రాజకీయ ప్రవేశం చేసిన రోజు నుంచి మెగా అభిమానులు చిరంజీవి 150వ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి ఆశలను నెరవేర్చాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గత సంవత్సర కాలంగా ఈ సినిమాపై కసరత్తులు చేస్తున్నాడు. ఇంకా కథ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు తెలియడం లేదు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ప్రారంభం అవుతుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక డైరెక్టర్ న్ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. అతనెవరో కాదు మన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. గత కొద్ది రోజులుగా ఈ చిత్ర మేకర్స్ ఎక్కువగా పూరి జగన్నాధ్ తో చర్చలు జరుపుతున్నారు. మరి ఫైనల్ గా కూడా పూరి జగన్నాధ్ చిరు 150వ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తాడా.? లేక వేరే ఎవరన్నా వస్తారా అన్నది చూడాల్సి ఉంది.

చిరంజీవి కూడా తన కంబ్యాక్ ఫిల్మ్ మైలురాయిగా నిలిచిపోవాలని ట్రై చేస్తున్నారు. అలాగే మెగా అభిమానుల అంచనాలను అందుకొని వాళ్ళని థ్రిల్ చేసేలా ఉండాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు