తన సినిమా రిలీజ్ మీద డైరెక్టరే కేసు వేశాడు

Published on May 15, 2021 12:00 am IST

లాక్ డౌన్ కారణంగా పలు సినిమాలు ఓటీటీ బాటపడుతున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో శింబు, హన్సికలు కలిసి నటించిన ‘మహా’ కూడ ఉంది. సుమారు నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ రూపొందింది. ఈ చిత్రానికి యు.ఆర్. జమీల్ డైరెక్టర్ కాగా వి.మతియాలగన్ నిర్మాత. ఈ చిత్రాన్ని నిర్మాత ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ దర్శకుడు మాత్రం సినిమా రిలీజ్ కాకుండా నిలుపుదల చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు కారణం తనకు తెలియకుండానే సినిమాను కంప్లీట్ చేయడమేనని దర్శకుడు జమీల్ అంటున్నారు.

సినిమాలో కొంత భాగాన్ని తనకు తెలియకుండా సహాయ దర్శకుడితో షూటింగ్ చేయించారని, ఎడిటింగ్ కూడ తన నోటీసుకు రాకుండానే చేశారని, కథకు అవసరమైన కొన్ని సన్నివేశాలను అసలు తెరకెక్కించనే లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్ ఇంకా పూర్తిగా చెల్లించలేదని, తనకు తెలియకుండా సినిమా కంప్లీట్ చేసినందుకు అదనంగా మరో 10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కేసును విచారించిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలని నిర్మాతను ఆదేశిస్తూ తదుపరి వాయిదాను మే 19కి వాయిదా వేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైన చిత్రం కొత్త సమస్యలో చిక్కుకోవడంతో శింబు అభిమానులు మరింత నిరాశకు లోనవుతున్నారు.

సంబంధిత సమాచారం :