“ఇనిమెల్” సాంగ్ పై గోపిచంద్ మలినేని ఏమన్నారంటే?

“ఇనిమెల్” సాంగ్ పై గోపిచంద్ మలినేని ఏమన్నారంటే?

Published on Mar 26, 2024 3:00 PM IST

సౌత్ లో ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ లలో శృతి హాసన్ ఒకరు. అదే విధంగా తన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న లోకేష్ కనగరాజు నటనతో ఆకట్టుకుంటున్నారు. శృతి హాసన్ మరియు లోకేష్ లు ఇద్దరూ కూడా ఒక సాంగ్ కోసం కలిసి పని చేశారు. కమల్ హాసన్ లిరిక్స్ అందించిన ఇనిమెల్ పాటలో వీరిద్దరి పెర్ఫార్మెన్స్ కి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యం లో సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు సైతం ఇనిమెల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మేకర్స్ టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఇనిమెల్ సాంగ్ లవ్ అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా శృతి హాసన్, లోకేష్ కనగరాజు లు ఇద్దరూ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నట్లు పేర్కొన్నారు. అయితే డైరెక్టర్ గోపీచంద్ మలినేని చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటకి తమిళనాట మంచి రెస్పాన్స్ వస్తోంది. తమ అభిమాన హీరోయిన్ ను మరియు డైరెక్టర్ ను ఇలా ఒకే సాంగ్ లో కలిసి చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు