రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ – గోపీచంద్ మలినేని

Published on Mar 25, 2022 5:00 pm IST


టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ పై సోషల్ మీడియా వేదిక గా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్, గూస్ బంప్స్ అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారు అన్ని క్రాఫ్ట్స్ లో మాస్టర్ అని మరొకసారి నిరూపితం అయింది అని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటూ కొనియాడారు. మాస్ అండ్ మాసివ్ ర్యాంపేజ్ అని అన్నారు. ఎంఎం కీరవాణి ఎక్ట్రా ఆర్డినరీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అద్బుతం అని అన్నారు. టీమ్ అందరికీ కంగ్రాట్స్ తెలిపారు.

అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకు పోతుంది.

సంబంధిత సమాచారం :