సారా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ హాస్య నటుడు అలీ సమర్పణ లో రామ గౌతమ్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ ఈచిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన మా సినిమా టీజర్ లాంచ్చెయ్యడం వల్లే మా సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. మా సినిమా బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. చిరంజీవిగారు మా సినిమా గురించి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మా సినిమా యొక్క అసలు ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈసినిమా ప్రధానంగా హ్యూమన్ ట్రాఫికింగ్‌కి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించాను. మా మూవీ జనరల్ గా అమ్మాయి, అబ్బాయి లవ్ కాదు. ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల ఇంటర్‌నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. ఈ కాన్సెప్ట్ మొత్తం ప్రతి దగ్గర అందరికీ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఫిలిం ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు కూడా అదే విధంగా ఉంటుందని భావిస్తున్నాను. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది .
ఈసినిమాను ఆలీగారు తీసుకున్నారు. ఆయన తమ్ముడు ఖయ్యుమ్ ఈ చిత్రంలో నటించాడని ఆయన ఈ సినిమా తీసుకోలేదు.ఈ సినిమా ఆయన చూశారు, చూసిన తర్వాత ఈ సినిమా ఆయనకు బాగా నచ్చి ఒకరోజు నన్ను పిలిచి దీన్ని ఏమి చేద్దామనుకుంటున్నావు, ఎలాచేద్దామనుకుంటున్నావు అని అడిగారు. దీనికి నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి ఒకవేళ సపోర్ట్ కావాలంటే ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలి అని అడిగారు. అప్పుడు నేను ఒకటే అడిగా మీరు దీంట్లో యాడ్ అవ్వండి అని ఆయన చేశారు అనగానే ఆయన తరుపు మాకు సపోర్టింగ్ దొరికింది. చిరంజీవిగారు వచ్చారు. చిరంజీవిగారు కేవలం ఆలీగారికోసమే సినిమా మొత్తం చూశారు. చూడటమే కాదు ఆయన ప్రత్యేకించి సినిమా గురించి చాలా సేపు మాట్లాడారు నాతో. పర్సనల్‌గా ఆయన నన్ను సినిమా గురించి మెచ్చుకోవడం చాలా ఆనందం అనిపించింది. ఇదంతా కేవలం ఆలీగారి యాడింగ్ వల్లే జరిగింది. అందుగురించి ఆలీగారి హెల్ప్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఆలీగారు చాలా సపోర్ట్ చేస్తున్నారని అని ఆయన వివరించారు.


