ఎమోషనల్ బ్యాక్‌ డ్రాప్‌ లో విజయ్ దేవరకొండ ?

Published on Jun 7, 2021 4:09 pm IST

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హీరో విజయ్ దేవరకొండకి కథ చెప్పాడని, కథ విజయ్ కి బాగా నచ్చిందని, దాంతో గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి ఫుల్ స్క్రిప్ట్ కూడా రాశాడు. త్వరలోనే ఫుల్ స్క్రిప్ట్ కూడా చెప్పనున్నాడని.. ఫుల్ స్క్రిప్ట్ విన్న తర్వాత బాగుందని ఫీల్ అయితే.. విజయ్ వెంటనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్తాడట.

కాగా క్రేజీ ఎమోషనల్ బ్యాక్‌ డ్రాప్‌ తో గౌతమ్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఎలాగూ గౌతమ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి కాబట్టి.. సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకువచ్చే అవకాశం ఉంది. పైగా గౌతమ్ ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ‘జెర్సీ’ తెలుగులో సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది.

సంబంధిత సమాచారం :