పవన్ సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హరీష్ శంకర్!

పవన్ సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హరీష్ శంకర్!

Published on Nov 17, 2022 8:47 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో బిజిగా ఉంటూనే, సినిమాల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న హారి హర వీరమల్లు చిత్రం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను యాక్షన్ సెట్స్ లో చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు సూపర్, డైరెక్టర్ జాబ్ సూపర్ అంటూ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. హరిహర వీరమల్లు సెట్స్ లో డైరెక్టర్ హరిష్ శంకర్ ను చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు డైరెక్టర్ క్రిష్. పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం లో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు