తన సినిమా ఎనౌన్స్ చేయలేదని బాధగా ట్వీట్ చేసిన స్టార్ డైరెక్టర్ !

Published on Jul 18, 2018 6:44 pm IST


దర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌ గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. కానీ గత కొన్ని సినిమాలుగా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా ప్రస్తుతం హరీష్ దిల్ రాజుకు ఓ కథ చెప్పారు. గతంలో హరీష్ శంకర్, దిల్ రాజు కాంబినేషన్ లో ‘రామ‌య్య వ‌స్తావ‌య్యా, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌’ సినిమాలు వచ్చాయి. ఆ అనుబంధంతో హ‌రీష్ చేయాలనుకుంటున్న మ‌ల్టీస్టార‌ర్ కు దిల్ రాజే నిర్మాత‌గా ఉన్నారు.

కాగా ప్ర‌స్తుతం దిల్ రాజు తన బ్యానర్ లో ఐదు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆ చిత్రాల రిలీజ్ డేట్లును తాజాగా దిల్ రాజు నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. రాజ్‌త‌రుణ్ ల‌వ‌ర్ ఈ నెల 20న రిలీజ్ అవుతుంటే, నితిన్ శ్రీనివాస క‌ల్యాణం ఆగ‌స్టు 9వ తేదీన‌, హ‌లో గురు ప్రేమ కోస‌మే అక్టోబ‌ర్ 18వ తేదీన రిలీజ్ అవబోతున్నాయని దిల్ రాజు నిర్మాణ సంస్థ తెలిపింది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి వెంక‌టేష్‌, వ‌రుణ్ ఎఫ్‌2, ఏప్రిల్ 5న మ‌హేష్ బాబు 25వ చిత్రం రిలీజ్ కానున్నాయి.

ఈ ట్వీట్ ని హ‌రీష్ శంక‌ర్‌ రీట్వీట్ చేస్తూ.. ఈ జాబితా నుంచి నా సినిమా మిస్ అయింది. చాలా బాధ‌గా ఉంది. కానీ, కొన్నిసార్లు కొన్ని త‌ప్ప‌వు. ఈ ఐదు చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించాలని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :