కోర్ట్ తీర్పుతో అరెస్ట్ నుండి బయటపడ్డ రజని డైరెక్టర్

Published on Jun 26, 2019 8:00 pm IST

దర్శకుడు పా.రంజిత్‌కు రాజరాజ చోళన్‌ను కించపరచేలా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయనపై కేసు నమోదైంది. మధురై హైకోర్టు శాఖలో పా.రంజిత్‌ అరెస్టుకు పిటిషన్‌ దాఖలు కావడంతో ఆయన మందస్తు బెయిల్‌కు దాఖలు చేసుకున్నారు.దీంతో కోర్టు పా.రంజిత్‌ను ఈ నెల 21వ తేదీ వరకూ అరెస్ట్‌ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారంతో ఆ గడువు పూర్తి కావడంతో పా.రంజిత్‌ మందస్తు బెయిల్‌ కోసం మరోసారి శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శుక్రవారం పా.రంజిత్‌కు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది.

తాజాగా మద్రాస్ హై కోర్ట్ రంజిత్ కి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. అతనిని పోలీస్ కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని,కోర్ట్ వాయిదాలకు హాజరైతే సరిపోతుంది అన్నట్లుగా తీర్పు వెలువరించారు. ఐతే రంజిత్ మళ్ళీ ఒకరి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడరాదని, ఒకవేళ ఆయన ఈ వ్యాఖ్యలు పునరావృతం చేస్తే బెయిల్ రద్దు చేయాల్సివస్తుంది అని కోర్ట్ షరతులు విధించినట్లు సమాచారం. దీనితో ఈ దర్శకుడికి పెద్ద ఉపశమనం లభించినట్లైంది.

సంబంధిత సమాచారం :

X
More