
గమ్యం చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమై క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు క్రిష్. కేవలం దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా రచయితగా నటుడిగా తనలోని బహుముఖ ప్రజ్ఞాశాలిని ఇప్పటికే చూపించాడు. అయితే ప్రస్తుతం ఇటు దర్శకుడిగా ఎన్టీఆర్ బయోపిక్, మణికర్ణిక లాంటి భారీచిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే, అటు వరుణ్ తేజ్, ఘాజీ దర్శకడి కాంబినేషన్ లో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంత బిజీలో కూడా క్రిష్ ఓ సీరియల్ కు కథ అందిస్తూ నిర్మిస్తుండటం విశేషం.
వివరాల్లోకి వెళ్తే ‘పల్లెటూరి పిల్ల’ అనే టైటిల్ తో క్రిష్ నిర్మాణంలో ఓ టీవీ సీరియల్ రూపొందుతుంది. క్రిష్ అందించిన ఈ సీరియల్ కథ సినిమా నేపథ్యంలో సాగుతుందట.ఓ పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి హీరోయిన్ గా ఎలా ఎదిగింది అనే పాయింట్ తో రానుంది ఈ సీరియల్. గతంలో క్రిష్ నిర్మించిన ‘స్వాతి చినుకులు’ సీరియల్ మంచి విజయం సాధించింది. అలాగే ఈ ‘పల్లెటూరి పిల్ల’ సీరియల్ కూడా విజయం సాధిస్తుందని ఈ సీరియల్ బృందం బలంగా నమ్ముతుంది.