క్రిష్‌ కు గురజాడ విశిష్ఠ పురస్కారం !

క్రిష్‌ కు గురజాడ విశిష్ఠ పురస్కారం !

Published on Nov 4, 2018 11:24 PM IST

Krish
నేటి తెలుసు సినిమా దర్శకుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న జాగర్లమూడి క్రిష్‌ కు గురజాడ విశిష్ఠ పురస్కారంను ఇస్తున్నామని విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని ప్రధానం చేస్తున్నారు.

ప్రస్తుతం క్రిష్, నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ‘ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్’ తెరకెక్కిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, ఆ తర్వాత జనవరి 24న రెండో పార్ట్ అయిన ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు