క్రిష్ ని డైరెక్షన్ నుండి తప్పించారట ?

Published on Sep 3, 2018 8:12 pm IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయిన చిత్రం ‘మణికర్ణిక’. పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే కంగ‌నాకు, క్రిష్ కు మ‌ధ్య విభేదాలు వచ్చాయని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తాజాగా దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని ప్రచారం సాగుతోంది. ఆ మేరకు ప్రఖ్యాత ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కి చెందిన వెబ్ సైట్ లో ఓ కథనం వెలువడింది. కాగా క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మణికర్ణిక ప్రాజెక్టు విడిచిపెట్టాకే క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ అయ్యాడని ప్రచారం సాగుతోంది. ఆ క్రమంలోనే కంగనా మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందిట. సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది .

సంబంధిత సమాచారం :