కమల్ హాసన్ “విక్రమ్” షూటింగ్ పై డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు!

Published on Jan 27, 2022 4:00 pm IST


కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విక్రమ్. ఈ చిత్రం ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై కమల్ హాసన్ మరియు ఆర్.మహేంద్రన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించిన పలు విషయాలను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడించారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది అని, ఫిబ్రవరి నెల మధ్య లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది అని చెప్పుకొచ్చారు. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :