విజయ్ మూవీపై వస్తున్న ఆపుకార్లలో నిజంలేదు

Published on Nov 17, 2019 11:00 pm IST

తలపతి విజయ్ బిగిల్ మూవీతో మరో బంపర్ హిట్ అందుకున్నారు. తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైన ఈ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా రికార్డు కలెక్షన్స్ సాధించింది. తెలుగులో విజిల్ గా విడుదలైన ఈ చిత్రం విజయ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. విజయ్ గత చిత్రాలైన మెర్సల్, సర్కార్ చిత్రాలు కూడా హిట్ మూవీస్ గా నిలిచాయి. ఇక విజయ్ తన నెక్స్ట్ మూవీని కూడా ఇటీవలే ప్రకటించేశారు. విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు.

కాగా ఈమూవీ రీమేక్ అంటూ గత కొద్దిరోజులుగా మాధ్యమాలలో వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. తాను విజయ్ హీరోగా తీస్తున్న చిత్రం రీమేక్ అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన ఖండించారు. ఒరిజినల్ కథతోనే ఈ మూవీ తెరకెక్కుతోందని ఆయన చెప్పడం జరిగింది. ఈమూవీలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర చేయడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

More