త్వరలో సేవ్ ది టైగర్స్ 2 షూట్ ప్లాన్ చేస్తున్నాము – డైరెక్టర్ మహి వి రాఘవ

త్వరలో సేవ్ ది టైగర్స్ 2 షూట్ ప్లాన్ చేస్తున్నాము – డైరెక్టర్ మహి వి రాఘవ

Published on May 7, 2023 7:49 PM IST

ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు నటించిన వెబ్ సీరీస్ సేవ్ ది టీజర్స్. మహి వి. రాఘవ, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సీరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు అలాగే మహి వి. రాఘవ, ప్రదీప్ అద్వైతం ఈ సీరీస్ కు క్రీయేటర్స్ గా ఉన్నారు. సేవ్ ది టైగర్స్ సీరీస్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోన్న సందర్భంగా దర్శకులు మహి వి రాఘవ మీడియా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా దర్శకులు మహి వి రాఘవ మాట్లాడుతూ, “సేవ్ ది టైగర్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక మంచి సీరీస్ తీశామనే తృప్తి ఉంది. ఫన్ ఎలిమెంట్స్ బాగా కనెట్స్ అయ్యాయి, అందరూ బాగా చేశారు. ఈ సీరీస్ కు మంచి ఆదరణ లభించింది అందరూ సీరీస్ కు సీక్వెల్ ఎప్పుడూ అని అడుగుతున్నారు త్వరలో సీరీస్ 2 షూట్ ప్లాన్ చేస్తున్నాము. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని సేవ్ ది టైగర్స్ నిరూపించింది. హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ చూసిన అందరూ మెచ్చుకుంటున్నారు. కనెక్ట్ అవుతున్నారు. మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చెయ్యడానికి ఈ సీరీస్ హెల్ప్ అయ్యింది.

త్వరలో సైతాన్ అనే కొత్త వెబ్ సీరీస్ తో రాబోతున్నాను. అది డిఫరెంట్ జానర్ లో ఉంటుంది. వచ్చే నెలలో ఆ సీరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే సిద్దా లోకం ఎలా ఉంది నాయనా అనే సినిమా కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది, శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అలాగే యాత్ర 2 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి, త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు