టి ఎన్ ఆర్ కుటుంబానికి దర్శకుడు మారుతి సాయం.!

Published on May 13, 2021 10:01 am IST

ఈ మధ్యనే ప్రముఖ జర్నలిస్ట్ మరియు ఇంటర్వ్యూ స్పెషలిస్ట్ టి ఎన్ ఆర్ కోవిడ్ బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. దీనితో తెలుగు ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దీనితో వారి కుటుంబానికి ఆర్ధికంగా సాయం చెయ్యడానికి సినిమా వారు అంతా ముందుకొచ్చారు. అలా మెగాస్టార్ చిరంజీవి తక్షణ సాయంగా లక్ష రూపాయలను టి ఎన్ ఆర్ భార్య జ్యోతి గారికి పంపారు.

అలాగే హీరో సంపూర్ణేష్ బాబు కూడా 50 వేల రూపాయలు ఆర్థికసాయం చేశారు. మరి ఇప్పుడు ఈ లిస్ట్ ప్రముఖ దర్శకుడు మారుతి కూడా చేరారు. తాను కూడా ఒక 50 వేల రూపాయలను టి ఎన్ ఆర్ భార్య జ్యోతి గారి బ్యాంకు ఖాతాకు పంపి ఈ సమయంలో ప్రతి ఒకరు తమకు తోచినంత సాయం చెయ్యాలని సూచించి తన ఉదారత చాటుకున్నారు. మరి ఇదిలా ఉండగా మారుతి ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ తో “పక్కా కమర్షియల్” అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :