మారుతి నిర్మాణంలోని కొత్త సినిమా వివరాలు !

మారుతి నిర్మాణంలోని కొత్త సినిమా వివరాలు !

Published on Mar 29, 2018 6:34 PM IST

గుడ్ సినిమా గ్రూప్ సంస్థలో మారుతి నిర్మాతగా మారి కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది. తాజాగా ఈ సంస్థ నుండి మరో సినిమా రాబోతోంది. అంతా కొత్తవాళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నారు. ‘రోజులు మారాయి’ సినిమాకు దర్శకత్వం వహించిన మురళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ రేపు విడుదల చెయ్యబోతున్నారు. ‘భలే మంచి చౌక బేరం’ అనే డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాకు పెట్టడం జరిగింది. రేపు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగ చైతన్య, అను ఇమ్మాన్యుల్ ఈ మూవీలో నటిస్తున్నారు.

తాజా వార్తలు