చిరు ‘భోళా శంకర్’కి మెహర్ రమేష్ రెమ్యునరేషన్ ఎంతంటే?

Published on Sep 28, 2021 3:00 am IST


మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న వరస సినిమాల జాబితాలో వేదాళం రీమేక్ ‘భోళా శంకర్’ సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమాతో పాటు లూసీఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ పూర్తి అయ్యాక ‘భోళా శంకర్’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మెహర్ రమేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక చాలా గ్యాప్ తీసుకున్న మెహర్ రమేశ్‌ని చిరంజీవి పిలిచి మరీ వేదాళం సినిమాను రీమేక్ చేసే బాధ్యతను అప్పగించారు. అయితే ఈ సినిమాకు మెహర్ రమేష్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఈ సినిమా మొదలై పూర్తయ్యే వరకు కేవలం నెల జీతానికే పని చేస్తున్నట్లు తెలుస్తుంది. నెలకు 5 లక్షల చొప్పున జీతం తీసుకుంటున్నాడట. 2020 సెప్టెంబర్‌లోనే వేదాళం రీమేక్ ప్రీ ప్రొడక్షన్ మొదలు కాగా ఇప్పటి వరకు మెహర్ 60 లక్షల జీతం అందుకున్నాడని, మరో ఏడాదైనా ఈ సినిమా కోసం పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మరో 60 లక్షలు తీసుకునే అవకాశం ఉందని, దాంతో పాటు సినిమా విడుదలైన తర్వాత 20 శాతం వాటా కూడా తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా కోసం మెహర్ రమేష్ దాదాపు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా తీసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం :