విశాల్ మూవీ కొరకు లండన్ మ్యూజియంకి వెళ్లిన దర్శకుడు

విశాల్ మూవీ కొరకు లండన్ మ్యూజియంకి వెళ్లిన దర్శకుడు

Published on Aug 17, 2019 11:00 AM IST

2017లో విశాల్ నటించిన “తుప్పరివాలన్” మూవీ మంచి ఆదరణ దక్కించుకుంది. విశాల్ మొదటిసారి ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో కనిపించారు. డైరెక్టర్ మిస్కిన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఓ ఇంటెలిజెంట్ క్రిమినల్ గ్యాంగ్ ఆటకట్టించే డిటెక్టివ్ గా విశాల్ అద్భుతంగా చేయడం జరిగింది. తెలుగులో డిటెక్టివ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.

కాగా ఈమూవీకి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్న డైరెక్టర్ మిస్కిన్ లండన్ లోని షెర్లాక్ హోమ్స్ మ్యూజియం సందర్శించారు. మూవీ మరింత ఆకర్షణీయంగా రావడం కోసం,మరియు డిటెక్టివ్ పాత్రను ఇంకా ఆసక్తికరంగా మలచడం కోసం ఆయన ఈ చారిత్రాత్మక మ్యూజియంని సందర్శించడం జరిగింది. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోలే రాసిన కల్పిత షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ రోల్ వందల ఏళ్లుగా అనేక డిటెక్టివ్ రచనలకి, చిత్రాలకు ప్రేరణగా ఉంది. లండన్ లో ప్రపంచంలోనే మొదటిసారి ఓ కల్పిత డిటెక్టివ్ పాత్రకు సంబంధించి ఓ మ్యూజియం నడపడం విశేషం.

విశాల్ సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు. ప్రస్తుతం విశాల్ యాక్షన్ అనే చిత్ర షూటింగ్ పాల్గొంటున్నారు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సి సుందర్ తెరకెక్కిస్తుండగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు