దర్శకుడు త్రినాధరావు చేతుల మీదుగా ‘‘కథంటే ఇదేరా” ఫస్ట్ లుక్ విడుదల

దర్శకుడు త్రినాధరావు చేతుల మీదుగా ‘‘కథంటే ఇదేరా” ఫస్ట్ లుక్ విడుదల

Published on Apr 16, 2021 2:00 PM IST

ప్రతిమ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరామ్, వెన్నెల హీరోహీరోయిన్లుగా హరీష్ చావా దర్శకత్వంలో దాసరి ప్రతిమ నిర్మించిన మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ ‘కథంటే ఇదేరా’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ప్రముఖ దర్శకులు నక్కిన త్రినాధరావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యాపీడేస్ ఫేమ్ వంశీతో పాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు.

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం దర్శకులు నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. వినగానే కథ తెలుసుకోవాలనే కోరిక కలిగి, పాయింట్ ఏంటి అని అడిగితే.. కథ లైన్ వినిపించారు. చాలా కొత్తగా అనిపించింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, చిత్రయూనిట్‌కు మంచి పేరు రావాలని అభినందిస్తూ.. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..” అన్నారు. తమ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి.. శుభాకాంక్షలు తెలిపిన నక్కిన త్రినాధరావుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.. అని చిత్రయూనిట్ పేర్కొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు