ఇంటర్వ్యూ : నందినిరెడ్డి – ‘ఓ బేబీ’ మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమా !

ఇంటర్వ్యూ : నందినిరెడ్డి – ‘ఓ బేబీ’ మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమా !

Published on Jun 30, 2019 5:37 PM IST

లేడి డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రాని’కి అనువాదంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ల యువతి 70 ఏళ్ల వృద్ధురాలిగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందనే అంశాలు ప్రధానంగా ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సంద‌ర్భంగా నందినిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆమె వెల్లడించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం.

 

సమంత గాని మీరు గాని సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమాలో ఏ అంశాలు చూసి మీకు అంత నమ్మకం ?

 

కథే అండి. మేం బాగా కనెక్ట్ అయిన కథ. ఆ కథను నిజాయితీగా తీశామనే నమ్మకం ఉంది. అన్నిటికి మించి మనందరికీ మన జీవితాల్లో మదర్ ఎమోషన్ ఎంతో కీలకమైనది. ఆ ఎమోషనే ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కొన్ని రోజులు పాటు గుర్తుండిపోతుంది సినిమా.

 

అసలు కొరియన్ మూవీ ‘మిస్ గ్రాని’నే తెలుగులో ఎందుకు రీమేక్ చేయాలనిపించింది ?

 

ముందుగా సమంతనే ఈ సినిమాని నా దగ్గరకి తీసుకొచ్చింది. ఇక తెలుగులో ఈ సినిమా చెయ్యటానికి కారణం కొరియన్ మూవీని మన తెలుగు వాళ్ళు ఎంతమంది చూసి ఉంటారు. ఇది మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అందుకే రీమేక్ చేశాం.

 

సినిమాలో సమంతగారు ఎలా నటించారు ?

 

సమంత తప్ప బేబీ పాత్రలో ఇంత గొప్పగా ఇంకెవ్వరూ చెయ్యలేరేమో అనేంత స్థాయిలో తను ఈ సినిమాలో నటించింది. తను నటిచడంతో పాటు స్క్రిప్ట్ లో కూడా బాగా ఇన్ వాల్వ్ అయింది.

 

సీనియర్ నటి లక్ష్మిగారు కూడా ఈ సినిమాలో కీలకం కదా. ఆమె గురించి చెప్పండి ?

 

ఆవిడ ఈ సినిమా చెయ్యకపోతే బహుశా సమంత – నేను ఈ సినిమా చేసి ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే.. ఆవిడ చేసిన పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ పండించాలంటే ఖచ్చితంగా గొప్పనటి నటించాలి. నాకు ఇక లక్ష్మిగారు తప్ప ఇంకెవరూ కనిపించలేదు. నిజంగా ఆవిడ మహానటి.

 

మీరు సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకోవడానికి కారణం ?

 

కథే నండి. కథ అంత త్వరగా నాకు నచ్చదు. నేను ఒక మూడు నెలలు ఒక కథ రాసాక అది నాకు నచ్చదు. అలా లేట్ అవుతూ ఉంటుంది. సినిమా అయితే చాల తక్కువ టైంలోనే తీస్తాను. స్క్రిప్ట్ వల్లే నాకు గ్యాప్ వస్తోంది.

 

మీరు కథలు రాసాక ఎక్కువుగా ఎవరితో షేర్ చేసుకుంటుంటారు ?

 

ఎక్కువుగా స్వప్న దత్ కి కథ చెప్తాను. ‘అలా మొదలైంది’ దగ్గర నుంచి తను నాకు బాగా క్లోజ్. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కి చెప్తాను. వాళ్ళందరీ అభిప్రాయాలు తీసుకుంటాను.

 

మీ తదుపరి సినిమా గురించి చెప్పండి ?

 

వైజయంతి బ్యానర్ లో ఒక సినిమా ఉంది. ఆల్ రెడీ రెండు కథలు ఓకే అయ్యాయి. మల్టీస్టారర్ ఒకటి, ఎంటర్ టైనర్ జోనర్ లో మరొకటి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నా తరువాత సినిమాగా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు