‘రామాయణ’లో విజువల్స్ పై దర్శకుడు క్లారిటీ !

‘రామాయణ’లో విజువల్స్ పై దర్శకుడు క్లారిటీ !

Published on Jun 25, 2026 2:00 PM IST

Ramayana

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు యశ్‌.. రావణుడిగా కనిపించనున్నారు. ఐతే, రామాయణ పై ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఇదే కథతో మరో సినిమా వస్తే.. నేటి తరం ప్రేక్షకులు చూస్తారా అని
దర్శకుడు నితేష్ తివారీని అడిగారట. దానికి ఆయన సమాధానంగా ఈ సినిమాలో అడుగడుగునా గ్రేట్ విజువల్ ట్రీట్ ఇస్తున్నాం, నవతరం ప్రేక్షకులను సైతం మెప్పించేలా ఈ చిత్రాన్ని మోషన్ క్యాప్చర్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం’ అని
నితేష్ తివారీ తెలిపారు.

మొత్తానికి సినీప్రియులందరి దృష్టి ప్రస్తుతం ‘రామాయణ’ మీదే ఉంది. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విదేశీ నిపుణులు పని చేస్తున్నారు. పైగా సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్‌తో ఇండియా మరియు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు