గత ఏడాది గీత గోవిందం సినిమాతో మ్యాజిక్ చేశారు దర్శకుడు పరశురాం. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ యూత్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీనితో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఆయనకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. దీనితో ఆయన మళ్ళీ దర్శకుడు పరుశురాం తో చేయాలనీ డిసైడ్ అయ్యారు.
కాగా పరుశురాం తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ట్ మహేష్ తో చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే ఆయన మహర్షి మూవీ అనంతరం అనిల్ రావిపూడి తో కమిట్ ఐయ్యారు. ఇక మహేష్ తో పరుశురాం మూవీ ఉంటుందో లేదో అన్న తరుణంలో పరుశరామ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. మహేష్ తో మూవీ ఉంటుందని అది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతుందని ఆయన చెప్పారు. కాగా మహేష్ సరిలేరు నీకెవ్వరు తరువాత వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పరుశురాం మూవీ ఆతరువాత ఉండే అవకాశం కలదు.


