ఇంటర్వ్యూ : పరుశురామ్ – గీతకు గోవిందే విలన్, గోవిందానికి గీతే విలన్

Published on Aug 7, 2018 3:21 pm IST

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర దర్శకుడు పరుశురామ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

ముందుగా గీత గోవిందం జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ స్టార్ట్ అవుతుందో చెప్పండి ?
అది సినిమాలో చూసి తెలుసుకొండి. ఒక్కటి మాత్రం చెప్తాను. సినిమాలో గోవిందానికి ఓ ఐడియాలజీ ఉంటుంది. గీతకు ఇంకో ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీల మధ్య వచ్చే కాన్ ఫ్లిక్ట్ నే ఈ సినిమా.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రొఫెసర్ అట నిజమేనా ?
ప్రొఫెసర్ కాదండి. అసిస్టెంట్ ప్రొఫిసర్. నిజానికి తను జూనియర్ సైంటిస్ట్ పోస్ట్ కు అప్లే చేసి ఉంటాడు. ఆ గ్యాప్ లో నారాయణ లాంటి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫిసర్ గా వర్క్ చేస్తుంటాడు. ఇక గీత ఐటీ ఎంప్లాయ్ గా కనిపిస్తోంది.

విజయ్ దేవరకొండ ఇమేజ్ కి మీ సినిమాలో తను చేసిన పాత్రకు అస్సలు పొంతన లేదు ?
అర్జున్ రెడ్డి సినిమాలోని పాత్రను బట్టి విజయ్ అలా అగ్రీసివ్ గా నటించాడు. మా సినిమాలోని పాత్రకు అనుగుణంగా నటించాడు. గీత గోవిందంలో తను చాలా డౌన్ టు ఎర్త్. చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్, వాల్యూస్ ఉన్న ఓ మంచి వ్యక్తిగా కనిపిస్తాడు.

సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఏమైనా ప్రత్యేకమైన కేర్ తీసుకున్నారా ?
అంటే సాంగ్స్ హిట్ చేసేద్దామని అనుకుంటే హిట్ అవ్వవండి. ప్రతి సాంగ్ కు ఓ సందర్భం ఉండాలి. మా సినిమాలో సాంగ్స్ అన్ని మోంటేజ్ సే. ప్రతి సాంగ్ లో కథ నడుస్తోంది. అదికాక మేం సాంగ్స్ కోసం చాలా వర్క్ చేసాము. మా మ్యూజిక్ డైరెక్టర్ గోపి కూడా బాగా కోపరేట్ చేసాడు.

అసలు విజయ్ తో సాంగ్ పాడించాలనే ఐడియా ఎవరిదీ ?
నాదే అండి. నిజంగా తను చాలా బాగా పాడాడు. అది అనవసరంగా కాంట్రవర్సీ అయింది.

ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మిగిలిన నటీనటులు కనపడనంత బాగా చేసింది అంటున్నారూ ?
అంటే గీత పాత్ర అలా ఉంటుందండి. ఆ పాత్రకి నటించడానికి అంత స్కోప్ ఉంటుంది. నేను పది పదిహేను మంది హీరోయిన్లకు ఈ కథ చెప్పాను. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పని హీరోయిన్ లేదు.

మరి ఎందుకు వాళ్ళు రిజక్ట్ చేశారు ?
అక్కడ రిజక్ట్ చేసేంత లేదండి. అంటే ఎవరికైనా బెటర్ అప్షన్ కోసమే చూస్తారుగా. విజయ్ కొత్త వాడు, పరుశురామ్ అప్ కమింగ్ డైరెక్టర్ ఇలా చాల ఉంటాయి కదా. ఏ పెద్ద హీరోయిన్ కైనా స్టార్ హీరోతోనో పెద్ద డైరెక్టర్ తోనో చెయ్యాలని ఉంటుంది కదా.

ఈ సినిమాలో మొదట హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె పై కొన్నాళ్ళు షూట్ కూడా చేశారట ?
లావణ్యతో షూట్ ఏం చెయ్యలేదు. విజయ్ డేట్లుకు తన డెట్లుకి కుదరలేదు. ఆలా డేట్లు క్రాస్ వచ్చాయి. దాంతో తను ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించారు ?
గీత గోవిందంలో విలన్లు ఎవరు లేరు. గీతకు గోవిందే విలన్, గోవిందానికి గీతే విలన్.

ఓ ఫిల్మ్ మేకర్ గా మీ స్ట్రెంత్ ఏమిటి ?
నా స్ట్రెంత్ ఎమోషన్ అండ్ కామెడీ. నేను ఏ సినిమా చేసినా ఈ రెండు ఎప్పటికి మిస్ కాకుండా చూసుకుంటాను.

దర్శకుడిగా కంటే మీకు రచయితగానే ఎక్కువ పేరు ఉంది. దీనికి మీరంటారు ?
నాలోని రచయితను డైరెక్టర్ ను విడదీసి చూడలేను. రచయితతో పాటు దర్శకుడిగా కూడా కష్టపడుతున్నాను.

మీ తర్వాత సినిమాలు ఏమిటి ?
మైత్రీ మూవీస్ కి ఒక సినిమా చెయ్యాలి, అలాగే గీతా ఆర్ట్స్ లో ఇంకో సినిమా ఉంటుంది. స్క్రిప్ట్స్ అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదు. రెండు మూడు లైన్లు ఉన్నాయి, కూర్చొని వర్క్ చెయ్యాలి.

సంబంధిత సమాచారం :

X
More