ఇండస్ట్రీలో దర్శకుల ప్రయాణం చాలా కఠినం. సక్సెస్ లేకపోతే కనుమరుగైపోవాల్సి వస్తుంది. ఎన్నో హిట్స్ అందుకున్నరు వారు కూడా ఒక ప్లాప్ వలన అవకాశాలకు దూరమైన ఉదాహరణలు కోకొల్లలు. గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్స్ సుకుమార్, కొరటాల వంటివారు కూడా ఏడాదికిపైగా మరో చిత్రం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ కోవలోకే వస్తాడు దర్శకుడు పరుశు రామ్.
గత ఏడాది గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు పరుశురామ్ . మరి అంత పెద్ద హిట్ తరువాత కూడా ఆయనకు హీరో దొరకలేదు.ఒక మూవీ కూడా సెట్స్ పైకి తీసుకెళ్లలేక పోయాడు. ఐతే ఏడాదిన్నర తరువాత పరుశురామ్ ఓ యంగ్ హీరోతో మూవీ మొదలుపెట్టనున్నారని సమాచారం. నాగచైతన్య పరుశురామ్ తో మూవీ చేయడానికి ఒప్పుకున్నారట. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ మూవీపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం కలదని తెలుస్తుంది.


