మహేష్ మూవీ విషయంలో పరుశురామ్ చాలా సీరియస్.

Published on Aug 6, 2020 3:00 am IST


మహేష్ లాంటి స్టార్ హీరోతో మూవీ చేసే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. అదే సమయంలో పెద్ద ఛాలెంజ్ కూడా. అభిమానుల అంచనాలు అందుకోవడంతో పాటు మహేష్ ఇమేజ్ కి ఎక్కడా తగ్గ కుండా మూవీ తెరకెక్కించాలి. బ్లాక్ బస్టర్ హిట్ పడితే వరుసగా స్టార్ హీరోలు క్యూ కడతారు. లేదంటే అసలు అవకాశం ఇవ్వరు. అందుకే రాకరాక వచ్చిన అద్భుత అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని పరుశురాం బావిస్తున్నారు.

అందుకే సర్కారు వారి పాట మూవీకి సంబంధించి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. స్క్రిప్ట్ తో పాటు మహేష్ మేనరిజం, లుక్ సరికొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. ఇక ఈ లాక్ డౌన్ వలన సమయం దొరకడంతో మరింత సునిశితంగా పరుశురాం స్క్రిప్ట్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండగా, సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More