కెజిఎఫ్2 అధీరా లుక్ వెనుక అసలు కథ..!

Published on Aug 4, 2020 4:31 pm IST

కెజిఎఫ్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరా రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అధీరా లుక్ ని ఇటీవల సంజయ్ దత్ పుట్టినరోజు కానుకగా చిత్ర బృందం విడుదల చేశారు. ఇక విలన్ గా అధీరా లుక్ ఓ రేంజ్ లో ఉంది. ముఖంపై టాటూలు, పెద్ద జడతో సంజయ్ లుక్ ఆసక్తి రేపింది. ఆయన లుక్ చూసిన తరువాత కెజిఎఫ్2 లో ఆయన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని అనిపిస్తుంది.

ఐతే అధీరా లుక్ వైకింగ్స్ స్పూర్తితో డిజైన్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. కాగా ఈ లుక్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేశారు. అధీరాను చూస్తే ఎవరైనా భయపడాలి అనేది, ప్రశాంత్ నీల్ కాన్సెప్ట్ అట. అందుకే ఆయన లుక్ కి వైకింగ్స్ లుక్ స్ఫూర్తిగా తీసుకున్నారట. ఇక ఆ మేకప్ వేయడానికి కూడా గంటల సమయం పట్టేదట. గంటల తరబడి ఓపికగా కూర్చోని మేకప్ వేయిన్చుకోనే వారట సంజయ్ దత్. ఇక హీరో యష్ నటిస్తున్న ఈ మూవీ విడుదల తేదీగా అక్టోబర్ 23ని ప్రకటించారు.

సంబంధిత సమాచారం :

More