‘ఫైటర్’ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది – పూరి జగన్నాథ్

‘ఫైటర్’ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది – పూరి జగన్నాథ్

Published on Oct 30, 2019 11:47 AM IST

puri

పూరి జగన్నాథ్ తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతున్న ఈ సినిమా, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది.

ఈ వేడుకకు విచ్చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ ఫాదర్ గోవర్ధన్ గారూ నేను ఫ్రెండ్స్. ఫిల్మ్ ఇన్సిట్యూట్‌లో నాకు సీనియర్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఇవాల ఆయన కొడుకు పెద్ద స్టార్ అయ్యాడు. హోమ్ ప్రొడక్షన్‌ లో సినిమా చేస్తున్నారు. వాళ్లు నన్ను ఇక్కడికి పిలిచారు. చాలా హ్యాపీగా ఉంది. గీతగోవిందం చేస్తున్నపుడు నా తమ్ముడు పరుశురామ్ చెప్పాడు. విజయ్ దేవరకొండతో పని చేయ్ అన్నా.. నువ్వు లవ్ చేస్తావ్ అని, ఇప్పుడు అదే అనిపిస్తుంది. విజయ్ సినిమా స్టార్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. గుర్తు పెట్టుకోండి ఫైటర్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’ అని పూరి తెలిపారు.

ఇక ఫైటర్ సినిమా షూటింగ్ ను డిసెంబర్ నాలుగో వారం నుండి నుండి మొదలుకానుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు