మహేష్ తో మరో పోకిరి చేద్దాం అంటున్న పూరి..!

Published on Aug 9, 2020 1:15 pm IST

మహేష్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పోకిరి. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. గ్యాంగ్ స్టర్ గా పోలీసుగా మహేష్ ని దర్శకుడు పూరి ప్రజెంట్ చేసిన తీరు అబ్బుర పరిచింది. ఇక ఈ చిత్రం తరువాత మహేష్ దర్శకుడు పూరితో బిజినెస్ మేన్ చేశారు. ఆ చిత్రం కూడా మంచి హిట్ కొట్టింది. ఐతే వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ వస్తే చూడాలని ఫ్యాన్సీ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఐతే మహేష్ కి మాత్రం కుదరలేదు.

దర్శకుడు పూరి మాత్రం మహేష్ తో మళ్ళీ మూవీ చేయాలని చాలా ప్రయత్నాలే చేశారు.మహేష్ ఇతర దర్శకులతో చిత్రాలు కమిట్ కావడం వలన ఆయనకు పూరి మరో చిత్రం చేసే అవకాశం రాలేదు. ఐతే మహేష్ అవకాశం ఇస్తే పోకిరి లాంటి భారీ బ్లాక్ బస్టర్ ఇస్తానని పూరి చెవుతున్నారు. రెండు చిత్రాలలో మహేష్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన పూరితో సినిమా చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More