పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను నేడు మేకర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్ కి అన్ని చోట్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా రాధే శ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ ఈ ట్రైలర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ రాముడు వచ్చాడు. గట్టిగా దర్శించుకోండి. మీ మాస్ కోరికలు అన్ని తీర్చేస్తాడు. ప్రభాస్ రాజు, పరమ పురుష ఆదిపురుష్ శ్రీ రామ రాజు గా అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.
Sri Ramudu vacchaadu, Gattiga darsinchunkondi!!! Mi mass korikalu anni thirchesthaadu!! Prabhas Raju as parama purusha #Adhipursh Sri rama Raju https://t.co/IIDT4Flikb
— Radhaa Krishna (@director_radhaa) May 9, 2023
