మనం రికార్డ్స్ కొట్టం…ప్రేమతో అవే పడతాయి – రాధే శ్యామ్ డైరెక్టర్!

Published on Dec 25, 2021 2:30 am IST

ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు లో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో, అదే తరహాలో హిందీ లో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

రాధే శ్యామ్ ట్రైలర్ ఇండియా లోనే నంబర్ వన్ రికార్డ్ ను కొల్లగొట్టింది. 24 గంటల్లో 64 మిలియన్స్ వ్యూస్ ను సాధించడం జరిగింది. ఒక ట్రైలర్ కి ఈ తరహా వ్యూస్ రావడం ఇదే తొలిసారి. ఈ వ్యూస్ రావడం పట్ల చిత్ర దర్శకుడు రాధే శ్యామ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మనం రికార్డ్స్ కొట్టం, ప్రేమతో అవే పడతాయి అని వ్యాఖ్యానించారు. రాధే శ్యామ్ ట్రైలర్ 64 మిలియన్ ప్లస్ రియల్ టైమ్ వ్యూస్ ను 24 గంటల్లో సాధించడం జరిగింది అని, మీ ప్రేమ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.

సంబంధిత సమాచారం :