మీ విజన్ కి ఎవరూ సాటి లేరు…ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పై డైరెక్టర్ రాధా కృష్ణ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

Published on Dec 9, 2021 3:01 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్దం గా ఉంది. దాదాపు మూడు గంటలకు పైగా ఉన్న ఈ చిత్రం కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ అద్బుతం గా ఉంది. విడుదలైన అన్ని బాషల్లో కూడా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.

ఈ చిత్రం ట్రైలర్ విడుదల కావడం తో సినీ ప్రముఖులు, అభిమానుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ అయిన రాధే శ్యామ్ కి దర్శకత్వం వహిస్తున్న రాధా కృష్ణ కుమార్ ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి విజన్ కి ఎవరూ సాటి లేరు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటన సైతం ఆటం బాంబుల్లా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా, అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :