లావణ్య సిగ్నల్స్ కి డైరెక్టర్ల స్పందన బాగుందట !

Published on Apr 8, 2020 12:00 am IST

హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలెంట్ అండ్ గ్లామర్ పరంగా ఒక స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు. అయినా లావణ్య మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అర్జున్ సురవరం సినిమా రూపంలో రీసెంట్ గా మంచి హిట్ వచ్చినా లావణ్య కెరీర్ మాత్రం ఆ తరువాత ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు కనీసం ‘అర్జున్ సురవరం’ సక్సెస్ తోనైనా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని లావణ్య గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టినా స్టార్ హీరోల చిత్రాల్లో చెప్పుకోతగ్గ ఛాన్స్ లను మాత్రం సాధించలేకపోయింది.

కెరీర్ స్టార్టింగ్ లో ఎక్స్ పోజింగ్ చెయ్యనని.. తన పాత్ర సినిమాలో కీలకంగా ఉండాలని ఇలా ఓవర్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చి ఛాన్స్ లు పోగొట్టుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ కు అవసరమైతే లిప్ టు లిప్ కిస్ కి కూడా రెడీ అని డైరెక్టర్స్ సిగ్నల్స్ పంపుతుందట. ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాలో లావణ్యనే హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచిస్తోన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే వచ్చే ఏడాది నాని -మారుతి కాంబినేషన్ లో రానున్న సినిమాలో కూడా లావణ్యనే హీరోయిన్ గా అనుకుంటున్నారట. అదే విధంగా కింగ్ అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’కి సీక్వెల్ గా చేస్తోన్న ‘బంగార్రాజు’లో కూడా ఈమెనే హీరోయిన్ ఫిక్స్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి లావణ్య సిగ్నల్స్ కి డైరెక్టర్లు బాగానే స్పందిస్తున్నారు.

ఇక కరోనా పై పోరాటంలో భాగంగా ఏ స్టార్ హీరోయిన్ విరాళం ప్రకటించని సమయంలోనే అందరి హీరోయిన్స్ కంటే ముందే లక్ష రూపాయిలు విరాళంగా ప్రకటించి అందర్నీ ఆకట్టుకుంది లావణ్య.

సంబంధిత సమాచారం :