యంగ్ డైరెక్టర్ సంపత్ నంది ఆర్ధిక సాయం

Published on Apr 3, 2020 11:00 am IST

యంగ్ డైరెక్టర్ సంపత్ నంది కరోనా బాధితుల సహాయార్ధం తన వంతు బాధ్యత నెరవేర్చాడు. కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం ఆయన 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది. ఇది ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయం గా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నీ సంపత్ నంది కోరారు. కరోనా కర్ఫ్యూ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల సహాయార్థం టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం సంపత్ నంది మాస్ హీరో గోపీచంద్ తో సిటీ మార్ అనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె కూడా లేడీ కబడ్డీ కోచ్ కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More